ట్యూబ్‌లైట్‌లో ఉండే మెర్క్యూరీతో ప్రమాదం


Sun,June 16, 2019 02:07 AM

చర్లపల్లి, జూన్‌ 15 : కాలుష్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకొవాలని సీసీసీఎం అణు ఇంధన శాఖ సినీయర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కరుణసాగర్‌ పేర్కొన్నారు. శనివారం ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని నార్త్‌ కమలానగర్‌, అభయ అసోసియేషన్‌ కార్యలయంలో శాస్త్ర యూనివర్సీటీ విద్యార్థులు, అభయ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ట్యూబ్‌లైట్‌ మెర్య్కూరీ వల్ల కాలుష్య బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాజెక్ట్‌ను రూపొదించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్‌తో పలు ఇబ్బందులు వస్తున్నాయని, ముఖ్యంగా ట్యూబ్‌లైట్‌లో ఉండే మెర్క్యురీతో ప్రమాదం పొంచి ఉందని, ఇంట్లో వాడుకునే ట్యూబ్‌లైట్‌ను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అభయ అసోసియెషణ్‌ ప్రతినిధులు అపర్ణ, శేషు, పద్మ, చంద్రకళలతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...