మైనర్లు..పదే పదే ఉల్లంఘనలు


Fri,June 14, 2019 12:52 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మైనర్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 12వరకు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 204 మంది మైనర్లు దొరికిపోయారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని, మైనర్ డ్రై వింగ్ కేసులను నమోదు చేశారు. గురువారం వాహనాలను నడిపిన 204 మంది మైనర్లు, వారి తల్లిదండ్రులకు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రాఫిక్ డీసీపీ-2 బాబూరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా నియంత్రించేందుకు హైదరాబాద్‌లో నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

మైనర్ డ్రైవింగ్‌కు భవిష్యత్తులో కష్టాలే...
మైనర్‌లు వాహనాలు నడిపిస్తూ పోలీసులకు దొరికికే..కేసులు నమోదై, జైలు శిక్ష పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాఫిక్ డీసీపీ బాబూరావు స్పష్టం చేశారు. వారికి పాసుపోర్టు, ప్రభుత్వ ఉద్యోగాలు, వీసాలు, విదేశీ కళాశాల్లో అడ్మిషన్ వంటి వ్యవహారాల్లో సమస్యలు వస్తాయన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...