వదంతులు నమ్మొద్దు


Thu,June 13, 2019 12:50 AM

-సైబరాబాద్ సీపీ సజ్జనార్ .
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ; బాలికలు, మహిళల అదృశ్యాలపై వస్తున్న వదంతులు నమ్మవద్దు. వారి రక్షణ కోసం 24 గంటలు పనిచేస్తున్నాం అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో సురక్షితమైన వాతావరణం నెలకొందన్నారు. అదృశ్యాలకు సంబంధించి వదంతులు స్పష్టించడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సందేశాలు పంపడం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై డయల్ 100, సైబరాబాద్, రాచకొండ వాట్సాప్ నంబర్లు 9490617444, 9490617111లకు సమాచారం ఇవ్వాలని బుధవారం సీపీ ఒక ప్రకటనలో సూచించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...