ప్రభుత్వ పథకాలే గెలిపించాయి : జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి


Thu,June 13, 2019 12:38 AM

మేడ్చల్, నమస్తే తెలంగాణ : తనను గెలిపించి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే విధంగా సహకరించిన ప్రజలకు, పార్టీ అధినేత సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు రుణపడి ఉంటానని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్ బుధవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే తనను గెలిపించాయని, తనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటానని అన్నారు. అధికారికంగా పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
చైర్మన్‌కు సన్మానం...: మేడ్చల్‌కు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిని స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి, ఎంపీటీసీ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు రవీందర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మధుకర్, వెంకటేశ్, గోపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, దేవ, అజ్మత్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...