ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కళాకారులకు ఆదరణ కరువు


Mon,May 27, 2019 02:58 AM

సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు చిత్రసీమలో తెలంగాణ కళాకారులకు సరైన ఆదరణ లభించకపోవడంతో ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కలేదని మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని ఔత్సాహిక సినీ రూపకర్తలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. అంతకుముందు అవతరణ ఫిల్మోత్సవం-2019 పోస్టర్‌ను శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రవీంద్రభారతి వేదికగా జూన్ 4న జరుగుతున్న ఈ అవతరణ ఫిల్మోత్సవం ద్వారా తెలంగాణ యంగ్ ఫిలిం మేకర్స్ వారి రంగాల్లో విజయాన్ని అందుకోవాలన్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ జూన్ 4న రవీంద్రభారతిలో జరిగే అవతరణ ఫిల్మోత్సవం వేడుకకు ప్రభుత్వ ప్రతినిధులు, పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై విజేతలకు బహుమతులను అందజేయనున్నారని చెప్పారు. ఫిల్మోత్సవానికి వచ్చిన లఘు చిత్రాలను 1 నుంచి 3వ తేదీల వరకు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్‌లో ప్రదర్శిస్తామని తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...