ట్రాఫిక్ రూల్స్.. అందరికీ చెప్పాలి


Sun,May 26, 2019 12:22 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ శిబిరంలో 11 నుంచి 15 సంవత్సరాల బాలబాలికలు పాల్గొన్నారు.ఈ శిబిరంలో పాల్గొన్న పిల్లలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనను కల్పించారు. వీటితో పాటు నృత్యం, సంగీతం, పెయింటింగ్, కార్టూన్, చేతి రాత, వ్యక్తిత్వ అభివృద్ధి అంశాలపై కూడా మెలుకువలను నేర్పించారు.శిక్షణలో నేర్చుకున్న విషయాలను తమ వంతు బాధ్యతగా ఇతరులకు తెలియజేస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.శిబిరంలో పాల్గొన్న విద్యార్ధులకు ప్రశంస పత్రాలు, మెమొంటోలను ట్రాఫిక్ విభాగం అదనపు డీసీపీ భాస్కర్ అందించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హోండా మోటర్ సైకిల్, స్కూటర్ ఇండియా ప్రై. లిమిటెడ్, ఆర్యన్ డ్యాన్స్ అకాడమీ, యోధ కరాటే సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ శిబిరాన్ని నిర్వహించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...