యశోదలో ముగిసిన యంగ్ డాక్టర్ క్యాంప్


Sun,May 26, 2019 12:21 AM

మారేడ్‌పల్లి: యశోదలో యంగ్ డాక్టర్స్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 300 మంది 9వ తరగతి పాస్ అయిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి మూడు రోజుల పాటు సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోదలో క్యాంప్‌లను నిర్వహించారు. రోగ నిర్థారణ పరీక్షలు, ఆపరేషన్లు, నర్సింగ్ విభాగాలకు తీసుకెళ్లి..అక్కడ ఉన్న పరికరాలను చికిత్స విధానాలను వారికి వివరించారు. క్యాంప్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి యంగ్ డాక్ట ర్స్ కిట్‌ను అందజేసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కాగా శనివారం సికింద్రాబాద్ యశోద దవాఖానలో విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. గత తొమ్మిది సంవత్సరాలుగా తాము ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామని వైద్య వృత్తి విశిష్టతను, దానిలోని సవాళ్లను, ఈ వృత్తి వల్లన లభించే యెనలేని తృప్తిని ఈ క్యాంప్ లో పాల్గొన్న బాలబాలికలకు వివరించామని యశోద గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్.రావు అన్నారు. యశోద దవాఖాన డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ లలితలతో పాటు పలువురు వైద్య నిపుణులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...