38 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు


Sat,May 25, 2019 01:03 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సార్వత్రిక ఎన్నికల్లో తలపడి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న చాలా మంది అభ్యర్థులు ఓట్ల వేటలో వెనకపడ్డారు. లక్షల్లో పోలైన ఓట్లల్లో కనీస మొత్తాన్ని కూడా సాధించలేకపోయారు. ఓట్ల వేటలో చతికిలపడి ధరావతును కోల్పోయారు. ఇలా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 13 మంది, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుం చి 25 మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మొత్తం 15 మంది, సికింద్రాబాద్ లోక్‌సభకు 28 మంది అభ్యర్థులు పోటీచేశారు. సెక్షన్ 34/1 (ఏ) ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం పోలైన ఓట్లల్లో 1/6 వంతు ఓట్ల సాధించనవారి ధరావతు గల్లంతు అయినట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు గాను సాధారణ అభ్యర్థులు రూ. 25 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ. 12.500లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తారు. ఓట్ల లెక్కింపు తర్వాత 1/6 వంతు ఓట్లు వస్తేనే సెక్యూరిటీ డిపాజిట్‌ను వాపస్ ఇస్తారు.
- సికింద్రాబాద్ పార్లమెంట్‌కు మొత్తం పోస్టల్ ఓట్లు కలుపుకుని 9,15,106 ఓట్లు లెక్కించగా, అభ్యర్థులు 1/6 వంతు ఓట్లు అంటే 1,52, 517 ఓట్లు సాధించాల్సి ఉండగా, విజేతగా నిలిచిన బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌లకు మాత్రమే ధరావతు దక్కగా, మిగిలిన 25 మంది అభ్యర్థుల ధరావతు గల్లంతయ్యింది.
- హైదరాబాద్ పార్లమెంట్‌కు మొత్తం పోస్టల్ ఓట్లు కలుపుకుని 8,77, 267 ఓట్లు లెక్కించగా అభ్యర్థులు 1/6 వంతు ఓట్లు అనగా 1,46,211 ఓట్లను సాధించాల్సి ఉండగా, విజేతగా నిలిచిన అసదుద్దీన్, రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి భగవంతరావులకు మాత్రమే డిపాజిట్ దక్కగా మిగిలిన 13 మంది అభ్యర్థుల ధరావతు గల్లంతయ్యింది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...