రంజాన్ షాపింగ్ రద్దీ ... ట్రాఫిక్ ఆంక్షలు


Sat,May 25, 2019 01:01 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రంజాన్ పండుగ షాపింగ్‌తో చార్మినార్ ప్రాంతంలో రద్దీగా ఉంటుంది. మదీనా నుంచి హిమ్మత్‌పురా వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 6 వరకు భారీ వాహనాలను దారి మళ్లిస్తూ, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ వాహనదారులకు పలు సూచనలు చేశారు.
ఆర్టీసీ, ఇతర బస్సుల దారి మళ్లింపు...
మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగుళూరు, శ్రీశైలంకు ఎంజీబీఎస్ నుంచి వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నల్గొండ క్రాస్‌రోడ్డు, చంచల్‌గూడ, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్, డీఎంఆర్‌ఎల్, ఫిసల్‌బండ, ఆరాంఘర్ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
- రూట్ నం.94తో పాటు అఫ్జల్‌గంజ్ నుంచి భూలక్ష్మి ఆలయం వైపు వెళ్లే వాహనాలు ఎంజే బ్రిడ్జి నుంచి సిటీ కాలేజీ, పురానపూల్ మీదుగా వెళ్లాలి.
- ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి నుంచి ఎస్‌ఏ ఛబుత్రా, లాల్ దర్వాజ, శాలిబండ నుంచి వెళ్లే వాహనాలు హిమ్మత్‌పురా నుంచి కిల్వత్, మోతీగల్లీ, మూసబౌల్, సిటీ కాలేజీ మీదుగా వెళ్లాలి.
- పరిస్థితులను బట్టి బహుదూరపురా వైపు వచ్చే వాహనాలను పురానపూల్, జుమ్మేరాత్‌బజార్, భూలక్ష్మి ఆలయం, అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లాలి, సిటీ కాలేజీ వైపు అనుమతించరు.
పార్కింగ్ స్థలాలు..
షాపింగ్ కోసం వచ్చే సాధారణ పౌరులు మిట్టికా శేర్, కాలికమాన్, లాడ్‌బజార్, మోతీగల్లీ, పంచ్ మెహల్ల, చౌక్ మదీనా, గుల్జార్ హౌస్, లక్కడకోట్‌ల వద్ద వాహనాలను నిలిపివేయాలి. వీళ్లకు చార్మినార్ బస్టాండ్, కులీఖుత్‌బ్ షా స్టేడియం, కిల్వత్‌లోని పెన్షన్ ఆఫీస్, కిల్వత్ గ్రౌండ్స్, కోట్ల అలిజాలోని ముసీద్ ఉల్ అలామ్ స్కూల్ గ్రౌండ్‌లో పార్కింగ్ కల్పించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...