న్యాయం చేయండి


Thu,May 23, 2019 12:11 AM

హిమాయత్‌నగర్: ఆడ పిల్లలకు జన్మనిచ్చినందుకు తనను ఇతరులకు విక్రయించిన భర్త,అత్తమామలతో పాటు కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధిత మహిళ ప్రభుత్వానికి మొర పెట్టు కుంది. బుధవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు ఇస్రత్ పర్వీన్,పియుసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాలతో కలిసి మాట్లాడారు.2016లో బండ్లగూడ,నూరీ నగర్ కు చెందిన ఫజల్ రహ్మాన్(25)తో తనకు వివాహం జరిగిందని, రెండేళ్ల పాప ఉండగా..నాలుగు నెలల క్రితం మరో ఆడ పిల్ల పుట్టిందని తెలిపారు.కుమారుడు పుట్టలేదన్న కక్షతో అత్తా మామలతో కలిసి భర్త తనను వేధింపులు చేయడం మొదలు పెట్టారని, పథకం ప్రకారమే మూడు నెలల క్రితం షాద్‌నగర్‌లో బంధువుల వివాహం ఉందని చెప్పి వెళ్లారని, తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసిన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు. అప్పటి నుంచి తాను ఇంట్లో ఒంటరిగా ఉంటున్న క్ర మంలో ఈనెల 16వ తేదీన బేగంపేటకు చెందిన సర్ఫరాజ్, అమ్జాజద్ ఖాన్‌తో పాటు మరో వ్యక్తి అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి నిన్ను, ఇద్దరు పిల్లలను మీ అత్తింటి వారు తమకు రూ.3లక్షలకు అమ్మేశారని బలవంతంగా తనను తీసుకువేళ్లేందుకు ప్రయత్నించారని వాపోయింది. ఈ విషయంపై తాను స్థానికుల సహాయంతో చాం ద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తన కేసును నిర్లక్ష్యం చేస్తూ కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వారిని వదిలిపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యే శరణమన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...