ప్రవీణ్‌కుమార్‌పై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోం


Thu,May 23, 2019 12:11 AM

ఉస్మానియా యూనివర్సిటీ: అణగారిన వర్గాలకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మార్పీఎస్ - టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న మనువాదులను తరిమికొడతామని హెచ్చరించారు. మనువాదానికి మాదిగ వాదంతో బుద్ధి చెబుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ - టీఎస్ జాతీ య అధ్యక్షుడు మేడి పాపయ్యతో కలిసి వంగపల్లి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే విద్యావకాశాలు అందిపుచ్చుకుంటున్న అణగారిన వర్గాల విద్యార్థులను దూరం చేయాలనే మనువాదుల కుట్రలో భాగంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు కర్నె శ్రీశైలంతో తప్పుడు ఆరోపణలు చేయి స్తున్నారని మండిపడ్డారు. గురుకుల విద్యాసంస్థల్లో పిల్లలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా చదువుతున్నారన్నారు. దానికి ప్రవీణ్‌కుమార్ కృషే కారణమని కొనియాడారు. ఆయనను గురుకుల విద్యాసంస్థ నుంచి తప్పిం చాలనే ఉద్దేశంతోనే అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. కర్నె శ్రీశై లంను వెనుకేసుకొస్తున్న బీజేపీ నాయకులకు గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్ కృషి కనపడడం లేదా అని ప్రశ్నించారు. సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యా ర్థులను చర్చకు రమ్మని పిలిచి, విద్యార్థులే తమపై దాడి చేశారని చెప్పడం వెనుక మనువాదుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కొంగరి శంకర్, నాయకులు బల్గురి విజయ్, హుస్సేన్, వరిగడ్డి చందు, ఆదిమల్ల గోవర్ధన్, అశోక్, కిరణ్, నాగరాజు, శ్రీరామ్, హన్మంతు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...