స్వేరోస్‌ను నిషేధించండి


Thu,May 23, 2019 12:11 AM

కవాడిగూడ, మే 22 : మీడియా సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే తమపై స్వేరోస్ గుండాలు దాడికి పాల్పడ్డారని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం ఆరోపించారు. సాంఘీక సంక్షేమ గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై, స్వేరోస్ సంస్థను నిషేధించాలని మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా తమపై దాడిచేసిన స్వేరోస్ సంస్థకు చెందిన గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాహక్కును హరించే విధంగా మీడియా సాక్షిగా దాడులు చేస్తున్నారని, స్వేరోస్ సంస్థ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వారిని కట్టడి చేయడంతో పాటు సంస్థను నిషేధించాలన్నారు. దాడి చేసినవారిపై, సంస్థ నిర్వాహకులపై రౌడీషీట్ నమోదుచేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల ప్రస్తుత కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వేరోస్ సంస్థను అధికారిక సంఘంగా మార్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్వేరోస్ సంస్థకు గురుకులాల్లోని కాంట్రాక్టులు ఇవ్వడం చట్టవిరుద్దమన్నారు.

భారతదేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని, మట్లాడితే భౌతిక దాడులకు పాల్పడటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలల్లో స్వేరోస్ సంస్థ పెత్తనం చెలాయిస్తూ తమకు నచ్చని వారిపై దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురుకులాల్లో అవినీతి జరుగుతుందని, విద్యార్థులు ఇబ్బందులకు, వేధింపులకు గురవుతున్నారని గవర్నర్‌ను కలిసి వివరించిన తర్వాత మీడియా ముందు వివరాలు వెల్లడిస్తుంటే దాడికి దిగడం దారుణమన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్ నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వైస్‌ప్రెసిడెంట్ పాలడుగు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి లక్ష్మణ్, నగర అధ్యక్షుడు తీగుళ్ల శివ, నాయకులు రవీందర్‌గౌడ్, సి.బి.వెంకటేశ్, బజరంగ్‌దళ్ నాయకులు రాము, నాగరాజు, మహేశ్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...