అవతరణ వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్‌గార్డెన్‌


Tue,May 21, 2019 12:35 AM

తెలుగుయూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చు కొని నాంపల్లిలో గల పబ్లిక్‌గార్డెన్‌లో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినో త్స వాలకు గార్డెన్‌ ప్రాంగణాన్ని అంగరంగవైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఉద్యానవన శాఖ కమిషనర్‌ ఎల్‌. వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఉద్యానవన శాఖ ఉద్యోగులు, సిబ్బంది సమిష్టిగా గార్డెన్‌ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర అవతరణ వేడుకలు నయనాందకరంగా కొనసాగేల భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గల గార్డెన్‌లో రెండు ఎకరాలలో పచ్చిక బయళ్ళతో, కార్పెట్‌ గ్రాస్‌తో, అందమైన పూలమొక్కల మధ్యన కొలువుదీరిం ది. సుమారు 3వేల మంది వరకు కెపాసిటీతో ఉన్న ఈ ప్రాంతంలో సకల సౌకర్యాలను కల్పిస్తూ ఆ శాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. పబ్లిక్‌గార్డెన్‌ ప్రాంగణాన్ని రాష్ట్ర ఆ బ్కా రి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మం త్రి వి . శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం సాయం త్రం ఉద్యానవనశాఖ కమీషనర్‌ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరక్టర్‌ విజయ్‌ప్రసాద్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ట, పర్యాటకశాఖ ఎండి మనోహరరావు, పోలీస్‌ అధికారులు, ప్రోటోకాల్‌ అధికారులు రాజ్‌కుమార్‌, రామయ్య తదితరులతో కలిసి పర్యటించి పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...