బేగంపేట్‌ మెట్రోస్టేషన్‌లో‘ఈవీ ఛార్జింగ్‌, పార్క్‌ హైదరాబాద్‌' కేంద్రాల�


Tue,May 21, 2019 12:35 AM

అమీర్‌పేట్‌ (నమస్తే తెలంగాణ): మెట్రోను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంలో సంస్థ మరో ముందడుగు వేసింది. ఫిన్‌ల్యాండ్‌ ప్రభుత్వానికి చెందిన ఫోర్టమ్‌ కంపెనీ హెచ్‌ఎంఆర్‌ఎల్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు నగరంలోని మెట్రోస్టేషన్లలో ఎలక్ట్రికల్‌ వాహనాలకు ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దేందుకు జరుగుతున్న కృషిలో భాగంగా ఈ ఛార్జింగ్‌ సెంటర్ల ఏర్పాటు అత్యంత ప్రాధానత్య సంతరించుకుంది. ఫోర్టమ్‌ సంస్థ దేశంలో మొత్తం 36 ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అందులో 10మెట్రో స్టేషన్లలో 24 కేంద్రాలను నెలకొల్పడం విశే షం. దీంతో పాటు బ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానం కింద మియా పూర్‌- అమీర్‌పేట్‌- నాగోల్‌ మధ్య 30 కి.మీల దూరంలో మొత్తం 24 స్టేష న్లలో ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు సేవలను సోమవారం బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, మెట్రోరైల్‌ ఎం.డి ఎన్వీఎస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

‘పార్క్‌ హైదరాబాద్‌' యాప్‌తో సేవలు..
చక్కటి సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ‘పార్క్‌ హైదరాబాద్‌'కు సంబంధించిన వివరాలను మెట్రో ఎం.డి ఎన్వీస్‌ రెడ్డి వెల్లడించారు. మెట్రో ప్రయాణీకుల వాహనాల పార్కింగ్‌ సమస్యలు తొలగించే క్రమంలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానం కింద మియాపూర్‌- అమీర్‌పేట్‌- నాగోల్‌ మధ్య 30 కి.మీల దూరంలో మొత్తం 24 స్టేషన్లలో ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని, ఈ పార్కింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే పార్క్‌ హైదరాబాద్‌ సిటిజన్‌ మొబైల్‌ యాప్‌ పేరుతో ఉన్న ఈ యాప్‌ను ఎవరైనా తమ ఫోన్ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండడం వల్ల ఈ పార్కింగ్‌ కేంద్రాల్లో నిర్వాహకుల సంఖ్య తక్కువగా ఉండనుందని, ఈ పార్కింగ్‌ స్థలాల్లో ఏకకాలంలో 250 ద్విచక్ర వాహనాలు, 10 కార్లు వరకు పార్కింగ్‌ చేసుకునే వీలుంది. ఆ విధంగా అన్ని స్టేషన్లలో కలిపి మొత్తం 4వేల ద్విచక్ర వాహనాలు, 200లకు పైగా కార్లను తగిన రుసులు చెల్లించి పార్కింగ్‌ చేసుకునే సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. జీపీఎస్‌ విధానం ద్వారా తాము ప్రయాణించబోతున్న మెట్రో స్టేషన్‌ ఆవరణలో తన వాహనానికి తగిన పార్కింగ్‌ స్థలం ఖాళీగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకునే వీలుందని, ఆ మేరకు పార్కింగ్‌ స్థలంలో భర్తీ అయిన స్థానాలు, ఖాళీగా ఉన్న స్థానాలను ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్‌ చేయబడతాయన్నారు. ఈ పార్కింగ్‌ స్థలాల్లో వైఫై సదుపాయాంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండనున్నాయని, త్వరలోనే వీటిని నగర కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘పార్క్‌ హైదరాబాద్‌' నిర్వాహకులు రమణారెడ్డితో పాటు మెట్రో అధికారులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...