‘ఔటర్‌'పై రోడ్డు ప్రమాదం


Tue,May 21, 2019 12:35 AM

శంషాబాద్‌ : ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఎదురుగా వెళ్తున్న లారీని డీసీఎం ఢీకొని డ్రైవర్‌ మృతి చెందాడు. అయితే మృతదేహం రెండు కి.మీల దూరంలో లభ్యమైంది. కాగా.. మృతదేహం దొరుకక పోలీసులు దాదాపు మూడు గంటల పాటు హైరానా పడ్డారు. ఈ సంఘటన శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్‌ఐ శ్రీధర్‌ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం, ఆతుకూరుకు చెందిన కొమ్ము ఏడు కొండలు (33) డీసీఎం డ్రైవర్‌. రెండు రోజుల కిందట మహారాష్ట్ర సోలాపూర్‌ వెళ్లి ద్రాక్ష లోడ్‌తో విజయవాడకు ప్రయాణమయ్యాడు. సోమవారం తెల్లవారు జామున మార్గమధ్యలో శంషాబాద్‌ మండలం, పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వెళ్తున్న ఓ లారీ అకస్మాత్తుగా ఆగడంతో డీసీఎం అదుపుతప్పి దాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ ఏడుకొండలు లారీ వెనుకలో ఎగిరిపడ్డా డు. ఇది గమనించని లారీ డ్రైవర్‌ అలాగే వెళ్లాడు. అయితే ఏడుకొండలు మృతదేహం దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పడిపోయింది.
కాగా.. మృతదేహం కోసం పోలీసులు మూడు, నాలుగు గంట లు వెదికారు. ఎట్టకేలకు రెండు కిలో మీటర్ల దూరంలో దొరింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...