వీధిదీపాల ఫిర్యాదులకు ప్రాధాన్యతనివ్వాలి


Tue,May 21, 2019 12:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వీధిదీపాల నిర్వహణపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ విభాగం పనితీరుపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో సంప్రదాయక విద్యుత్‌ దీపాల స్థానంలో 4,25,357 ఎల్‌ఈడీ లైట్లను అమర్చామని, వీటి నిర్వహణను సమీక్షించేందుకు 26,581 సీసీఎంఎస్‌ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. నగరంలో ప్రస్తుతం 97 శాతం వీధిదీపాలు వెలుగుతున్నాయని, ఈఈఎస్‌ఎల్‌ ఒప్పందంలో భాగంగా నిత్యం 98 శాతం వీధిదీపాలు వెలగాల్సి ఉందని ఈఈఎస్‌ఎల్‌ అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఎల్‌ఈడీ ప్రాజెక్టు అమలు నాటి నుంచి ఇప్పటివరకు 88,315 ఫిర్యాదులు అందాయని, వీటిలో 87,344 ఫిర్యాదులను పరిష్కరించామని, మరో 944 ఫిర్యాదులు పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నగరంలోని ఎల్‌ఈడీ లైట్లలో 3,66,055 వీధిదీపాలను కామన్‌ డ్యాష్‌ బోర్డుకు అనుసంధానం చేశామని, వీటి నిర్వహణను సాధారణ ప్రజలు సైతం తెలుసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. విద్యుత్‌ దీపాలకు సంబంధించి ఫిర్యాదులపై ఈఈఎస్‌ఎల్‌ ప్రత్యేకంగా 1800-180-3580 నంబర్‌ను ఏర్పాటు చేసిందని, ఈ నంబర్‌లో నగరవాసులు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ సందీప్‌ ఝా, చీఫ్‌ ఇంజినీర్‌ సురేశ్‌, ఈఈఎస్‌ఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...