వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలి


Mon,May 20, 2019 04:07 AM

- సేఫ్ అండ్ సెక్యూరిటికీ ప్రాధాన్యత
-సర్వెంట్ వెరిఫికేషన్ కోసం హాక్ ఐని వాడండి
- హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శాంతి భద్రతల విషయంలో ఇతర రాష్ర్టాలు 50 ఏండ్లలో సాధించలేని ప్రగతిని తెలంగాణ పోలీసులు ఐదేండ్లలో సాధించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ హైదరాబాద్ పోలీసులు దేశంలోని ఇతర పట్టణాల పోలీసులకే కాకుండా, ఇతర దేశాల పోలీసులకు కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు. వచ్చే నెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు పూర్తవుతున్నాయన్నారు. మోడ్రన్ టెక్నాలజీతో నేరా లను అదుపు చేసి, శాంతి భద్రతలను పరిరక్షణలో ముందున్నామన్నారు. హైదరాబాద్ సురక్షితమైన నగరంగా గుర్తించబడిందని, దీంతో వివిధ దేశాల అంబసీల నుంచి హైద రాబాద్ పోలసులకు అభినందనలు అందుతున్నాయన్నారు. నగరంలో ప్రతియేడు క్రైమ్ రేటు తగ్గుతుందని, పౌరులంతా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ఈ క్రైమ్ మరింత వరకు తగ్గించేందు వీలుంటుందన్నారు.

శాంతిభద్రతలు బాగున్నచోటనే వివిధ రంగాలలో ఆయా సంస్థలు పెట్టుబడులు పెడుతాయని, తద్వారా ఆ నగరం, రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రజలు సెలవుల్లో ఇంటి తాళం వేసే వెళ్తే.. సమాచారాన్ని స్థానిక సెక్టార్ ఎస్సై, బ్లూకోల్ట్స్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. ఇండ్లలో పనిచేసే వారి పూర్తి వివరాలు యజమానులు తెలుసుకోవాలన్నారు. ఇండ్లలో పనిచేసే వారి గూర్చి ఉచితంగా పోలీసులు వెరిఫికేషన్ చేసి ఇస్తారని, ఇప్పటికే 6 వేల నుంచి 8 వేల మందిని వెరిఫికేషన్ చేశామన్నారు. హాక్ ఐ అనే అప్లికేషన్‌లో ఈ అవకాశం ఉందని, ఇందులో పేర్లు నమోదు చేసుకోవాలని సీపీ సూచించారు. హైదరాబాద్‌లో నేరం చేస్తే ఎవరు కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు. నగరంలో కోటి జనాభా ఉందని, అం దులో ఒక శాతం కంటే తక్కువగా నేరాలు చేసేవారున్నారని, దీనిని మరింతగా తగ్గించేందుకు కృషిచేస్తున్నామన్నారు. మోడ్రన్ టెక్నాలజీతో ఎలాంటి నేరస్థుడినైనా పట్టు కుంటామన్నారు.

హైదరాబాద్ పోలసులు పక్క జిల్లాలకే కాకుండా, పక్క రాష్ర్టాలకు కూడా నేరాల నివారణలో సహాయపడుతున్నారన్నారు. ఇటీవల సెంట్రల్ జోన్ పరిధిలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం నడుపుతున్న భర్త హెల్మెట్ పెట్టుకున్నాడు, వెనుక కూర్చున్న భార్య హెల్మెట్ పెట్టుకోలేదు. అనుకోకుండా ప్రమాదం జరగడంతో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకవేళ ఆమెకు హెల్మెట్ ఉంటే, అంత పెద్దగాయాలు జరిగేవి కావు. ప్రతి జీవితం ముఖ్యమే. అందుకే వెనుక కూర్చున్న భార్యకు కూడా హెల్మెట్ ఉండాలి, ప్రతి కుటుంబంలోని పిల్లలు దీనిపై దృష్టి పెట్టాలి. తాము కూడా అవాగాహన తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. వైట్‌నర్ తాగి నేరాల బాటపట్టే వారు నగరంలో ఉన్నారు. దీంతో వైట్‌నర్ విక్రయించే దుకాణాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాం. ఇందుకు ఎస్బీలో ప్రత్యేక విభాగం వైట్‌నర్ అమ్మకాలపై నిఘా పెడుతుంది. ఒక దుకాణం ఎంత వైట్‌నర్ కొన్నది, ఎంత అమ్మింది, అది ఎవరికి అమ్మారు, కోనుగోలుదారులెవరు అనే విషయాలను ఆరా తీస్తుంది. దుకాణాదారులు కూడా బాధ్యత, పిల్లలకు వైట్‌నర్ విక్రయించవద్దు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...