ధూల్‌పేటలో ఆబ్కారీ దాడులు


Sat,May 18, 2019 01:21 AM

-ఆరుగురు అరెస్ట్.. 7కిలోల గంజాయి పట్టివేత
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురిని హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 కిలోల గంజా యి, ఆరు మొబైల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం... ధూల్‌పేట, బడాబంగ్లాకు చెందిన కిషోర్‌సింగ్ అతడి భార్య, కుమారుడు పవన్‌సింగ్‌లు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. సమాచా రం అందుకున్న ఆబ్కారీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.6కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో అదే ప్రాంతానికి చెందిన మహిళ, ఆమె కుమారుడు సురేష్‌సింగ్‌లు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి 1.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కేసులో ధూల్‌పేట్ దిలావర్‌గంజ్‌కు చెం దిన ప్రకాష్‌సింగ్ అతడి కూతురుతో కలిసి గంజాయి విక్రయిస్తుండగా ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 1.2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ మూడు కేసులను ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు చంద్రకుమార్, రవి, ఎస్‌ఐలు దామోదర్, నజీముద్దీన్, నజీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...