ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌


Thu,May 16, 2019 11:46 PM

-అనాథలకు తోడూ..నీడై..చేయూత
-నలుగురికి చేతనైనంత సాయం చేయడమే ధ్యేయం
-ఆదర్శంగా నిలుస్తున్న ప్రొఫెసర్‌ అచ్యుత సామంత
-నేడు ఆరో వార్షికోత్సవం..‘బ్యాగ్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' పేరిట ప్రత్యేక కిట్ల పంపిణీ
సిటీబ్యూరో: అభ్యాగులకు అండగా నిలుస్తున్నది. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.నలుగురికీ చేతనైనంత సహాయం చేయడం ద్వారా ప్రేమ, శాంతి, సంతోషాలను పంచుతూ..స్ఫూర్తినిస్తున్నది ‘ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌' . దీనిని 2013 మే 17న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త ప్రొఫెసర్‌ అచ్యుత సామంత ప్రారంభించారు.
నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు..
ప్రొఫెసర్‌ అత్యుత సామంత సమాజంలో పేరుకుపోయిన పేదరికం, ఆకలి, నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించేందుకు 1987 నుంచి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అణగారిన వర్గాలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు (కేఐఐటీ) కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ టెక్నాలజీ, (కేఐఎస్‌ఎస్‌) కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ పేరిట విద్యా సంస్థలను నెలకొల్పారు. కిట్‌, కిస్‌ సంస్థలతో 30 వేల మంది గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యా వసతి అందిస్తున్నారు.
యూనెస్కో, ఎంజీఐఈపీ సౌజన్యంలో....
యూనెస్కోతో పాటు మహాత్మా గాంధీ శాంతి, సుస్థిర అభివృద్ధి విద్యా సంస్థ (ఎంజీఐఈపీ) ల సౌజన్యంతో ‘ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌' అనే ఈ అత్యుత్తమ కార్యక్రమం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 20 వేలకు పైగా, ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ కేంద్రాల్లో కోటి మందికి పైగా ప్రజలతో మమేకమై ‘బ్యాగ్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
నేడు ఆరో వార్షికోత్సవం...
‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘బ్యాగ్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' (సంతోషాల పంపిణీ) అనే ప్రత్యేక, వినూత్న కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 30 ప్రదేశాల్లో దాదాపు 4000 వేల మంది చిన్నారులకు ‘బ్యాగ్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' కిట్లను పంపిణీ చేయనున్నారు.
నగరంతో పాటు వివిధ ప్రదేశాలు
రంగనాయకుల గుట్ట (ఎస్‌.మధుసూదన్‌ - 8886127127), రాజేంద్రనగర్‌ (మహ్మద్‌ ఇలియాస్‌ అలీ - 9100088531), నందనవనం (టి.సురేశ్‌ - 9949096904), తలాబ్‌కట్ట (మెహ్రోజ్‌ అండ్‌ హబీబ్‌ - 7032666693) ప్రాంతాల్లో 17న ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ‘బ్యాగ్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌' కిట్ల పంపిణీ ఉంటుంది. 18న సరూర్‌నగర్‌ (ఎస్‌.మధుసూదన్‌ - 8886127127), లెనిన్‌నగర్‌ (టి.సురేశ్‌, కే.రమేశ్‌ - 9949096904), సంగారెడ్డి (పి.రమేశ్‌, హబీబ్‌ - 9951741954), సిద్ధిపేట (ఎం.వినోద్‌ - 8686098860), గోదావరి ఖని (శ్రీధర్‌ - 8790866411) ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పంపిణీ ఉంటుంది. 19న మూసాపేట (ఎం.నవీన్‌ అండ్‌ అభిమన్యు - 9951177511, 9989707990), లింగోజిగూడ (ఎస్‌.మధుసూదన్‌ - 8886127127) ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కిట్లు అందజేస్తారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...