కాలుష్య ఉల్లంఘనుల సమాచారమిస్తే రూ. 10 వేలు


Thu,May 16, 2019 11:43 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోజురోజుకు కకావికలం చేస్తూ ప్రజారోగ్యానికి సవాలుగా మారిన కాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది. జల, వాయు, శబ్ధ కాలుష్యం, ఘన, రసాయన వ్యర్థజలాల అక్రమ డంపింగ్‌లు పార బోతలకు అడ్డుకట్ట వేసేందుకు వినూత్నంగా పంథాను ఎంచుకుంది. కాలుష్యానికి కారకులైన వారి సమాచారమిచ్చిన వారికి నజరానాను ప్రకటించింది. ఉల్లంఘనుల గురించి ఉప్పందించిన వారికి రూ. 10 వేల ప్రొత్సాహాకాన్ని ప్రక టిం చింది. ఇది వరకు నజరానా రూ 3 వేలు మాత్రమే ఉం డగా, దానిని రూ. 10 వేలకు పెంచడమే కాకుండా, ఫిర్యా దులు చేసేందుకు వీలుగా మొబైల్‌ నెంబర్లు, ఈ మేయిల్‌ ఐడీలను సైతం ప్రకటించింది. వివరాల్లోకి వెలితే.. గ్రేటర్‌లో కాలుష్యం రోజురోజు పంజా విసురుతున్నది. రసాయన వ్యర్థజలాల పారబోతలు, అక్రమ రవాణా, డంపింగ్‌లు యథేచ్ఛగా సాగుతున్నాయి.

విషవాయువులను నేరుగా గాల్లోకి వదిలేయడం, ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కాల్చివే య డం జరుగుతున్నది. వాస్తవికంగా ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా చేయడం పర్యావరణ చట్టాల ప్రకారం చట్ట విరు ద్ధం. ఇలా చేసిన వారిపై పీసీబీ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇందుకు కారకులైన కంపెనీలను మూసివేసిన ఘటనలు ఉన్నాయి. కాని నిఘా లేక పోవడంతో గ్రేటర్‌లోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు ఇష్టారీతిన వ్యవహారిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. అయితే ఇలాంటి ఉల్లంఘనుల జరుగుతున్న ప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారిపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దొరికిన వారు దొంగ లేదంటే దొర అన్నట్లుగా అన్నట్లుగా సాగుతున్నది. ఇలాంటి ఉల్లంఘనులకు చెక్‌పెట్టేందుకు పీసీబీ ఈ తరహా వ్యుహాన్ని ఎంచుకున్నది. పీసీబీకి సమారమిచ్చిన వారికి రూ. 10 వేల ప్రొత్సాహాకాన్ని ఇస్తామని, సమాచారమి చ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ) సభ్యకార్యదర్శి వి. అనిల్‌కుమార్‌ తెలిపారు.

సమాచారమివ్వాల్సిన అధికారులు..
సభ్యకార్యదర్శి వి. అనిల్‌కుమార్‌ : 90005 51355
చీఫ్‌ ఇంజినీర్‌ విశ్వనాథం : 99490 78336
రమేష్‌గుప్తా : 91773 03206
మేయిల్‌ఐడీ:ms-tspcb<\@>telangana.gov.in
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి
లీజుకు ఇచ్చిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసు
దుండిగల్‌(నమస్తేతెలంగాణ): సర్వే నంబర్‌ 31 సూరారం గ్రామ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు తొలగించి మారి భూమయ్య కుమారుడు శివరాజ్‌ అనే వ్యక్తి స్థలాన్ని కబ్జా చేసి పక్కనే ఉన్న జ్యోతిడెయిరీ మిల్క్‌(అడ్సన్‌)కంపెనీ వాహనాలను నిలుపుకునేందుకు లీజుకు ఇచ్చారు. కుత్భుల్లాపూర్‌ తహసీల్దార్‌ గౌతంకుమార్‌ సదరు భూమిని సందర్శించి విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మారీ శివరాజ్‌పై క్రిమినల్‌ కేసును నమోదు చేస్తున్నట్టు తహశీల్దార్‌ స్పష్టం చేశారు.
ఇక నుంచి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకోసం ఆయా స్థలాల సంబంధించి వీడియోగ్రఫీ తీయనున్నట్లు ఆయన తెలిపారు. గాజులరామారం పరిధిలో కట్టమైసమ్మ, దేవేందర్‌నగర్‌, కైసర్‌నగర్‌లతో పాటు సూరారం, కుత్భుల్లాపూర్‌, పేట్‌బషీరాబాద్‌ గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు వీడియోగ్రఫీతో పాటు పెన్సింగ్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరదావర్‌ నరేందర్‌, విఆర్వో రజీనీకాంత్‌ తెలిపారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...