నల్సార్‌లో ముగిసిన న్యాయవాదుల శిక్షణ శిబిరం


Thu,May 16, 2019 12:33 AM

శామీర్‌పేట : సమాజంలో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనడానికి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడుతాయని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ మరియు నల్సార్‌ న్యాయ విశ్వ విద్యాలయంలో సౌజన్యంతో గత ఐదు రోజులుగా నల్సార్‌లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం బుధవారం సాయంత్రం ముగిసింది. శిక్షణ పొందిన యువ న్యాయవాదులకు శిక్షణ పత్రాలతో పాటు రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని నల్సార్‌ రిజిస్టార్‌ ప్రొపెసర్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో నిరంజన్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా తలపిన కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన వెంటనే న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటా యించడం జరిగిందన్నారు. ఈ నిధి తెలంగాణ అడ్వకకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని దానిలో భాగంగానే ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలం గాణలోని బార్‌ కౌన్సెల్స్‌ నుంచి మొత్తం 73 మంది యువ న్యాయవాదులు శిక్షణ పొంద డం జరిగిందన్నారు. వారికి శిక్షణ పూర్తి చేసిన పత్రాలతో పాటు రూ.10 వేలు ఆర్థిక సహాయంగా అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్‌ బాలకిష్టారెడ్డి, క్రిమినల్‌ లా ప్రొపెజర్‌ బాలకృష్ణ, హై కోర్టు సీని యర్‌ న్యాయవాది మహమూద్‌ అలీ, న్యాయవాదులు బాబా టేల్కర్‌, శ్రీధర్‌రెడ్డి, ఏపీ. సురేశ్‌, హై కోర్టు ఏజీపీ వి.మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది మరియు న్యాయ పరిశోధకులు నల్సార్‌ శివచరణ్‌, అధ్యాపకులు, యువ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...