హుస్సేన్‌సాగర్ తీరానికి సందర్శకుల కళ..!


Fri,April 26, 2019 12:17 AM

- పార్కులకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హుస్సేన్‌సాగర్ తీరం సందర్శకులతో కళకళలాడుతుంది. సమ్మర్ సీజన్ నేపథ్యంలో రాజధాని పర్యటనలో ఇతర రాష్ర్టాలు, జిల్లాల ప్రజలు హుస్సేన్‌సాగర్ అందాలను వీక్షించేందుకుగాను సంజీయయ్య , లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లేక్ వ్యూ, లేజర్ షోలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి అందాలను ఆస్వాదిస్తున్నారు. దీంతో సాగర్ తీరం సందర్శకులతో కిటకిటలాడుతున్నది. సాధారణ రోజుల్లో ఈ ఐదు పర్యాటక ప్రాంతాలకు రోజుకు 5వేలకు మించని సందర్శకులు ..గడిచిన 15 రోజులుగా సరాసరి 20 వేలకు దాటడం విశేషం. ఈ నేపథ్యంలోనే సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, లేజర్ షోలకు సందర్శించే సందర్శకుల ద్వారా రోజుకు ఐదు లక్షల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

పెరుగుతున్న సందర్శకుల తాకిడి
ఏఫ్రిల్ నెలలో ఈ ఐదు పర్యాటక ప్రాంతాల్లో రోజుకు 20 వేల వరకు సందర్శకులు వస్తున్నారని, వారాంతపు రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...