మనిషిలో ఆశ పెరగడంతోనే అనర్థాలు


Wed,April 24, 2019 12:33 AM

సైదాబాద్, నమస్తే తెలంగాణ): సమాజంలో ప్రతి మనిషిలో ఆశ పెరుగడంతోనే స్వార్థం పెరిగి పరిసరాలను, భూమిని మరిచిపోతున్నాడని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. మంగళవారం వికాసతరంగిణి, సైదాబాద్ ఎస్బీహెచ్ పంచ కాలనీల సమన్వయకర్త రావికంటి శ్రీనివాస్ గుఫ్తా ఆధ్వర్యంలో సైదాబాద్ ఎస్బీహెచ్-బి కాలనీలోని శ్రీకోదండ రామాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బులు ఎలా సంపాదించాలని నిత్యం చెబుతున్నారని, సామాజిక విలువలను నేర్పించడంలో దూరంగా ఉంటున్నారన్నారు. విలువలతో కూడిన జీవితాలను, కాలుష్యరహితంగా ఉండే జీవన ప్రమాణాలను నేర్పించడం లేదని పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఆలోచనలు, అశలను పెంచుకోవడం ద్వారా ఆలోచనలు పక్కదారి పడుతున్నాయని తెలిపారు. దేవనాథ జీయర్ స్వామి, ప్రొపెసర్ పురుషోత్తం రావు, పర్యావరణ వేత్తలు వేణుగోపాల్ రావు, సురేశ్ గుఫ్తా, విజయ రామ్, వికాస తరంగిణి అధ్యక్షుడు టి. రమేశ్‌గుఫ్త్తా, పాండు రంగారావు, పి. సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...