బాలభవన్‌లో.. శిక్షణ భళా


Wed,April 24, 2019 12:31 AM

తెలుగుయూనివర్సిటీ: పబ్లిక్‌గార్డెన్ ప్రాంగణంలోని జవహార్ బాలభవన్‌లో సుమారు నెల రోజుల పాటు వేసవిలో లలిత కళల్లో తరగతులను నిర్వహిస్తారు. చిత్రలేఖనం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, తబలా, జీవ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం తదితర అంశాల పట్ల బాల్యదశలోనే శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే అధ్యాపకులు ఈ కేంద్రంలో పిల్లలకు భోధన సాగిస్తున్నారు. 5 నుండి 16 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఈ కేంద్రంలో ఆయా అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవుల్లో కళల పట్ల ఆసక్తి ఉన్న చిన్నారులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇచ్చి గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దేలా బాలభవన్ చర్యలు చేపట్టింది. కరాటే, స్కేటింగ్, పెయింటింగ్, నృత్యం, తబలా, మృదంగం తదితర వాయిద్య పరికరాలు, శాస్త్ర సాంకేతికత, సైన్స్ పరిజ్ఞానం కోర్సుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. లలిత కళల్లో శిక్షణకు ప్రైవేట్ సంస్థలకు ఫీజులు చెల్లించి పంపించలేని పేద, మధ్య తరగతి ప్రజలకు ఇదో సదావకాశం. కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను బాలభవన్ కేంద్రం అందజేస్తుంది.
కోర్సుల మేళవింపు..
ఔత్సాహిక చిన్నారులకు వాయిద్యాలలో మేళకువలు, నృత్యంలో ఆంగికం, అభినయం, సాత్వికం, సాహిత్యంలో తీసుకోవలసిన అంశాలు తదితర ప్రక్రియల్లో అవపోసన పట్టించేలా తర్ఫీదు నిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించి అత్యాధునిక పరికరాలను సమకూర్చింది.
ఎన్నో అద్భుతాలు...
గొప్ప శాస్త్ర, సాంకేతిక పరిశోధకులు చేసిన ప్రయోగాలను, సాధించిన విజయాలను విద్యార్థులకు సోదాహరణంగా వివరిస్తూ తెలిపే సూచికలతో గల బోర్డులు సమగ్ర విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. విశ్వం, భూగోళం, గాలి, నీరు, పర్యావరణం, ప్రకృతి, మానవ శరీర ధర్మ శాస్త్రం వంటి అంశాలను చిన్నారులకు పరిశోధన కేంద్రంలో గల అత్యాధునిక పరికరాలతో విజ్ఞానాన్ని పంచే కేంద్రం గొప్పగా ఉంది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా, వైద్యులుగా రాణించే వారికి బాల్యదశలో నేర్చుకునే ఈ విద్య ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...