డీసీఎం అతివేగానికి.. విద్యార్థి మృతి


Wed,April 24, 2019 12:28 AM

-కాలేజీకి వెళ్లివస్తుండగా ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
-ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
-హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణాలు
-ఆందోళనకు దిగిన తోటి విద్యార్థులు
దుండిగల్, (నమస్తేతెలంగాణ): డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యానికి...ఇంజినీరింగ్ విద్యార్థి బలయ్యాడు. కాలేజీకి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తుండగా అతివేగంగా ఎదురుగా దూసుకొచ్చిన గుర్తు తెలియని డీసీఎం ఢీకొట్టి అతని తలపై నుంచి వెళ్లింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెం దాడు. కాగా... విద్యార్థ్ధి మృతికి కారణమైన వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ తోటివిద్యార్థులు రెండున్నర గంటల పాటు రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకిరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం ...ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన ఆంజనేయులు, పద్మ దంపతులు నిజాంపేట మున్సిపాలిటీ, రాజీవ్‌గృహకల్ప సముదాయంలో నివా సం ఉంటున్నారు. ఆంజనేయులు ఆటోడ్రైవర్‌గా, పద్మ ప్రగతినగర్‌లోని ఎలీఫ్ పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు నాగ హేమంత్ (20) భౌరంపేటలోని డీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం బైక్ (టీఎస్ 08,జీబీ 3480)పై కళాశాలకు వెళ్లాడు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి బయలు దేరా డు. ప్రగతినగర్ కమాన్ సమీపంలోని ఉల్లాస్ రెస్టారెంట్ వద్దకు రాగానే... ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన గుర్తుతెలియని డీసీ ఎం అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగహేమంత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. నాగ హేమంత్ హెల్మెట్ ధరించినా ప్రాణాలు దక్కలేదు. తల్లిదండ్రుల రోధనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

విద్యార్థుల ఆందోళన...
కాగా... అప్పటివరకు తమతో గడిపిన తోటివిద్యార్థి నాగహేమంత్‌ను డీసీఎం ఢీకొట్టి వెళ్లిపోయిందని తెలుసుకున్న అతని స్నేహితులు, మిగతా విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడివున్న నాగహేమంత్‌ను చూసి విలపించారు. కాగా... విద్యార్థి మృతికి కారణమైన డీసీఎంను తక్షణమే గుర్తించి, డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. సాయంత్రం 6.30 గంటల వరకు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. చివరకు నిందితుడిని గుర్తించి బాధితుడికి న్యా యం చేస్తామని విద్యార్థులకు పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...