ఇండ్లపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్లు


Wed,April 24, 2019 12:27 AM

-మూడు ఇండ్లల్లో ఎలక్ట్రానిక్ గృహోపకరణ పరికరాలు దగ్ధం
- సందర్శించిన ప్రజాప్రతినిధులు, విద్యుత్‌శాఖ అధికారులు
- విద్యుత్ అధికారులతో మంత్రి సమీక్ష
కంటోన్మెంట్, (నమస్తే తెలంగాణ): బోయిన్‌పల్లి, బాపూజీనగర్‌లోని సాయిగ్రామర్ స్కూల్ పక్కనున్న బస్తీలో హై టెన్షన్ వైర్లు తెగి ఇండ్లపై పడ్డాయి. మూడు ఇండ్లకు విద్యుత్ సరఫరా అవుతున్న సర్వీస్ వైర్లకు హైటెన్షన్ వైర్లు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో గణేశ్, నిర్మల, రాజులకు చెందిన మూడు ఇండ్లలో ఎలక్ట్రానిక్ గృహోపకరణ వస్తువులు కాలిపోయాయి. బాత్‌రూంలో గ్లీజర్ వేసుకొని స్నానం చేస్తున్న ఓ బాలుడు విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో బస్తీవాసుల్లో భయాందోళన నెలకొంది. ప్రాణభయంతో ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టమేమి జరగకపోవడంతో బస్తీవాసులు ఊపీరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ(33లైన్) డీఈ భానుప్రకాష్, ఏడీఈ సునీల్‌లు ఘటన స్థలానికి చేరుకుని, సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపనప్రతాప్‌లు బాధితులను పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోర్డు సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత మంత్రి చామకూర మల్లారెడ్డి అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణానికి రూ.16 లక్షల నిధులను 2105లోనే కేటాయించారని గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.8 లక్షల ఆస్తినష్టం సంభవించిందని, ప్రభుత్వానికి నివేదిక అందజేసి బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని మహేశ్వర్‌రెడ్డి కోరారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...