రూ.500 కోట్లు లక్ష్యం


Wed,April 17, 2019 12:12 AM

-ఎర్లీబర్డ్ ద్వారా వీలైనంత ఆదాయం కోసం బల్దియా ప్రణాళికలు
-లక్ష్యాన్ని నిర్దేశిస్తూ జోనల్ కమిషనర్లకు ఆదేశాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎర్లీబర్డ్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20కి సంబంధించి జీహెచ్‌ఎంసీకీ ఆర్థిక లక్ష్యం నిర్దేశింప బడింది. ఈ నెల 30వ తేదీలోగా రూ. 500కోట్లను ఎర్లీబర్డ్ పథకంలో ఆస్తిపన్ను సేకరించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నును ముందస్తుగా ఈ నెల 30లోగా చెల్లిస్తే ఆస్తిపన్ను మొత్తంపై 5 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఎర్లీబర్డ్ కింద సేకరించే పన్ను లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లకు నిర్దేశిస్తూ కమిషనర్ ఎం. దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. గత సంవత్సరం ఎర్లీబర్డ్ పథ కం కింద రూ.433 కోట్లు వసూలు చేయగా ప్రస్తుత సంవత్సరం మరింత పెరిగింది. ప్రతిపాదిత రూ.500 కోట్ల ఆస్తిపన్ను సేకరణ లక్ష్యంలో 50 శాతం పన్నులు రూ.250 కోట్లు, వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల ద్వారా సేకరించాలని, పౌరసేవా కేం ద్రాల ద్వారా 20 శాతం పన్నులు రూ.100కోట్లు, మరో వంద కోట్లను ఆన్‌లైన్ ద్వారా రూ.50 కోట్ల ను మీ సేవా కేంద్రం ద్వారా సేకరించడానికి ప్రణాళికలు రూపొందించారు.

ఎర్లీబర్డ్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను సేకరణకు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులైన వాల్యూయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌కలెక్టర్ల ద్వారా సేకరించాలని కమిషనర్ దానకిషోర్ నిర్ణయించారు. గతంలో పన్ను చెల్లింపుదారులు కేవలం జీహెచ్‌ఎంసీ పౌరసేవా కేం ద్రాలు, ఆన్‌లైన్, మీ సేవా కేంద్రాల ద్వారా మాత్రమే చెల్లించేవారు. దీనికి భిన్నంగా ఈ దఫా జీహెచ్‌ఎంసీ ద్వారా కూడా నివాసేతర ఇళ్ల పన్నులను సేకరించడంపై దృష్టి సాధిం చారు. నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల నుండి ఆస్తిపన్నును సేకరించే విషయం లో ప్రత్యేకదృష్టి సాధించాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు దానకిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్ల ద్వారా ఆస్తిపన్ను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్నును చెల్లించి 5 శాతం రాయితీ పొందాలన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...