తెలంగాణలో విస్తృతంగా విద్యావకాశాలు : హోంమంత్రి


Tue,April 16, 2019 11:58 PM

అహ్మద్‌నగర్, ఏప్రిల్15 : తెలంగాణలో విస్తృత విద్యావకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు ఎడ్యుకేషన్ ఫెయిర్లు దోహదం చేస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సోమవారం మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్‌లో టీ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని, కేజీ టూ పీజీ ఉచిత విద్యతో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పలు పోటీ పరీక్షలకు శిక్షణలతో పాటు రోబోటిక్ , 3 డి ప్రింటింగ్ , ఏవియేషన్ వంటి అధునిక సాంకేతిక కోర్సుల సమాచారాన్ని అందుబాటులో పెట్టారు. షాదన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ , లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ , సెయింట్ జోసఫ్స్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలు పాల్గొని విద్యా రంగంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై 2 రోజుల పాటు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అహ్మద్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ అయేషా రుబీనా , ఏపీ కస్టమ్స్ అధికారి ఫహీమ్ అహ్మద్ , సినీతార హీనా షేక్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...