నూతన టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం


Tue,April 16, 2019 11:57 PM

మాదాపూర్: ప్రపంచ దేశాల్లో ఉన్న నూతన టెక్నాలజీతో కూడిన యంత్ర పరికరాలన్నీ కూడా ఒకే వేదికపై కొలువుదీరాయని, దంత వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్స్‌కు ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ప్రస్తుతం ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో కూడిన యంత్ర పరికరాలను ప్రదర్శనలో ఉంచారన్నారన్నారు. వీటి సహాయంతో దంత సమస్యలతో బాధపడుతున్న వారి దంతాలను స్కాన్ చేసి సరిపడా దంతాన్ని డిజైన్ చేసి అందిస్తుందన్నారు. గతంలో దంత వైద్యులకు టెక్నాలజీ అందుబాటులో లేక అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజినీరింగ్ టెక్నాలజీతో తయారు చేయబడిన అన్ని రకాల యంత్ర పరికరాలు, ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువుదీరాయన్నారు.

దంత సమస్యలను మొదటి దశలోనే గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, దంత వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సలభతర చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ... నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలతో సలభతర వైద్యం అందించే సౌకర్యం ఉందని, ఒకప్పుడు దంతాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్తది అమర్చాలంటే వైద్యులకు కూడా ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అటువంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో సలభతర చికిత్సను పూర్తి చేస్తున్నారన్నారు. 3డీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏ సైజులో ఎంత దంతాన్ని అమర్చాలో స్కాన్ చేసి సరిపడా దంతాన్ని మెటల్, స్టీల్ తదితర ఉత్పత్తులను అందిస్తుందన్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో ఎనిమిది దేశాల నుంచి 55కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, టర్కీ, కొరియా, చైనా, జపాన్, తదితర దేశాల ఉత్పత్తులు నూతన టెక్నాలజీతో కూడిన యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...