రామయ్య కల్యాణ మండపం..శిల్పకళా శోభితం..!


Sat,April 13, 2019 02:58 AM

-1960లో కల్యాణ మండపం నిర్మాణం...
1960 సంవత్సరంలో కల్యాణ మండప నిర్మాణం ప్రారంభమైంది. సుప్రసిద్ధ శిల్పాచార్యులు శ్రీ గణపతి స్థపతిగారిచే ఈ మండప నిర్మాణం జరిగింది. తమిళనాడులోని దిండివనం గ్రామము నుంచి ఆకుపచ్చ దాతురాయి, భద్రాచలం సమీపంలోని తాటాకులగూడెం నుంచి నల్లరాయిలను ఈ మండపానికి ఉపయోగించారు. అందమైన కళాఖండాలు చెక్కబడ్డాయి.
కల్యాణ మండపం 31 చదరంలో ఉపోప పీఠంతో చేయబడింది. ఈ పీఠంపై వరుసలో 50 నడిచే ఏనుగులు చెక్కారు. ఉపోపపీఠంపై భాగంలో ప్రతోప పీఠం అమర్చారు. ఇది పద్మ దళాలతో కూడి ఉంటుంది. దీనిని పద్మ జగతి కంఠంఅంటారు. స్తంభభూషణ లక్షణానుసారంగా ఒకొక్క స్తంభపు ఉపపీఠాన్ని నిర్మించారు. ఆ స్తంభాల రాతి కొలతలు 11-8 1/4 చతురంలో ఉన్నాయి. ఇవి ఆరు భాగాలు. ఒక్కొక్క భాగంలో క్షేత్ర మహాత్మ్యమును దర్శింపచేశారు. వరుసలో గరుత్మంతుని జయవిజయులను వైపు, ఆంజనేయస్వామి మరొక వైపు నిల్పారు. రామదాసు, శివధనుర్భంగం, చతర్భుజ రాముడు, పాణిగ్రహణం, పోకల దమ్మక్క శేషశాయి, శ్రీరామపట్టాభిషేకం, గీతోపదేశం, జనక మహారాజు కన్యాదానం, పంచముఖ వాద్యం, భద్రునికి రామసాక్షాత్కారం వరుసలో ఉన్నాయి. శివధనుర్భంగ 2, పాణిగ్రహణంలో పట్టాభిషేకంలో 12, కన్యాదానంలో 13 విగ్రహాలను అందంగా మలిచారు. శిల్పశాస్త్ర ప్రకారం ఈ భాగాన్ని కంఠం అంటారు.
మరో అద్భుతం కపోతం..
ఈ మండపంలో మరో అద్భుత నిర్మాణం కపోత పట్టి క. ఇందులో ఉత్తరాతన, ఎటుతుకం అనే భాగాలున్నాయి. దీనిలో మతలై అను పేరుగల కొన్ని వందల శిల్పాలు 2 1/2 అంగుళాల ఎత్తైనవి ఉన్నాయి. పై భాగం చూరువలె ఉంటుంది. దీనినే కపోతకం అంటారు. దీనిలో 13 పద్మదళాలు, అష్టదిక్పాలకులు, అష్టలక్ష్ములు, గరుత్మంతుడు, మహాసాలభంజికలు నిర్మించారు. తోప పీఠంపై మెట్లు, మెట్లకు రెండు ఏనుగులు, కోలాటం ఆడే స్త్రీలు, హంసలు ఉన్నాయి. ఈ పత్రోప పీఠంపై పద్మాసనం నల్లరాతితో నిర్మింపబడి నిగనిగలాడుతుంటుంది. దీనిపైనే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. 9టన్నుల బరువు గల ఏకశిలతో ఇది నిర్మింపబడింది. దీని అష్టదళాలపై అష్టమంగళం కన్పిస్తుంది. శంఖం, చక్రం, మత్స్యయుగ్మం, దర్పణం, స్తస్తికం, ఈపం, పూర్ణకుంభం, శ్రీవత్సం వీటిని మండపానికి షోడశస్తంభ మండపం అంటారు. ఇది 16స్తంభాలతో విలసిల్లుతున్నది. ఈ శాన్యస్తంభంలో అనేక శిల్పశాస్త్ర, సాంకేతిక విషయాలున్నాయి. దీనిపై పద్మపుష్కలం, అధిష్టానం, పద్మ దళాలు నిర్మించారు. ముందు భాగంలో చెక్కబడిన మూడు ముఖపత్రాలపై మూడు సింహాలు, వాటి నోళ్లలో చెక్కిన రాతిగుండ్లు ఉన్నాయి.
ముఖస్తంభంలో... : ముఖస్తంభంలో కమలా రామదాసుల శిల్పాలు, మంటప ద్వారంలో పడమరగా రుక్మిణీ సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు, ఆగ్నేయ స్తంభంపై శ్రీ భూదేవీ సమేతుడైన పరవాసుదేవుడు, చెలికత్తెలతో శ్రీ మహాలక్ష్మీ, ఆళ్వారులు, విరాజిల్లుతున్నారు. షోడశ భుజాలతో అలరారే సుదర్శనమూర్తి కూడా ఉన్నారు. నైరుతి స్తంభం వ్యత్యస్త పాదారవిందుడైన వేణుగోపాలుడు, పై భాగంలో వటపత్రశాయి కనుల విందుగా దర్శనమిస్తారు. తూర్పువైపు సరస్వతీదేవి వీణాపాణియై కనిపిస్తుంది. స్తంభాలకు పై భాగంలో నాలుగు మూలల్లో నాలుగు రాతి గొలుసులు వ్రేలాడుతుంటాయి. ఒకొక్క గొలుసుకు 4 అంగుళాల పొడవు గల 50 రింగులున్నాయి.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...