చెరువుల పనులు వేగంగా చేయండి


Sat,April 13, 2019 02:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో కొనసాగుతున్న చెరువుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. చెరువుల అభివృద్ధికి ఆటంకంగా మారిన కోర్టు కేసులు, ఇతర సమస్యలపై శుక్రవారం కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతానికి 185 చెరువులను గుర్తించగా, అందులో 19 చెరువులను రూ.279 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారు. 15 చెరువుల వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా, మిగిలిన చోట్ల వివిధ రకాల సమస్యలతో పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిచందన, చీఫ్ ఇంజినీర్ సురేశ్‌కుమార్, మూసీ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...