గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం..


Mon,March 25, 2019 03:12 AM

కంటోన్మెంట్/జవహర్‌నగర్: పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి మల్కాజిగిరి స్థానాన్ని అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుందామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆదివారం జవహర్‌నగర్‌లోని ఇందిర రాజీవ్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు గున్న రవి తమ కాలనీలోని 500 మంది ముఖ్య అనుచరులతో గ్రామ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జవహర్‌నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్సింగరావు ముదిరాజ్ తమ సంఘం సభ్యులు, ముఖ్య అనుచరులతో పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఇందిర రాజీవ్ నగర్ మహిళా అధ్యక్షురాలు జి. సంధ్య, అనసూయ, రత్న, పుష్పలత, అనుష, మంజిలాల్, ఎండీ ఎక్బాల్ తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నాయకులు చామకూర మహేందర్ రెడ్డి, ఏకే మురుగేశ్, బీజే కాంట్రాక్టర్స్ ఎండీ అయ్యప్ప, ఎంపీటీసీ మంజుల పాల్గొన్నారు.
వెంగళరావునగర్ : ఆదివారం వెంగళరావునగర్ డివిజన్‌లోని రహ్మత్ నగర్ చేపల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు సురేశ్ ముదిరాజ్, కృష్ణమూర్తి, నటరాజ్ యాదవ్ ఉన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్, విజయ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ శ్యామ్‌రావు, నర్సింహ పాల్గొన్నారు.

దుండిగల్, నమస్తేతెలంగాణ : ఆదివారం ఒక్కరోజే శంభీపూర్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో 300 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీడిమెట్ల డివిజన్ ద్వారకానగర్‌కు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్‌పల్లి వినాయకనగర్‌కు చెందిన కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు ఆదివారం శంభీపూర్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అదే విధంగా బాచుపల్లి గ్రామసర్పంచ్ ఆగంపాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని హరితవనం కాలనీకి చెందిన 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజుయాదవ్ , నాయకులు భద్రారెడ్డి, ధన్‌రాజు యాదవ్, కృష్ణ, అభిషేక్ రెడ్డి, విజయారెడ్డి ,రవినాయక్, పద్మారావు, నర్సయ్య, డి.శివ పాల్గొన్నారు.

బేగంపేట : ఆదివారం రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ ఆధ్వర్యంలో డివిజన్‌కు చెందిన వినోద్, చందు, నందు, రాంవ్యాస్‌లతో పాటు మరో 50 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి తలసాని శ్రీనావాస్ యాదవ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసం వద్ద వారందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...