గ్రేటర్‌లో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు


Fri,March 22, 2019 04:15 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నిత్యం రద్దీగా చీమలదండును పోలినట్లుండే వాహన సముదాయాలతో కనబడే నగర రోడ్లపై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. గతంతో పోల్చితే క్రమేపీ తగ్గుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా అధికారులు తీసుకున్న చర్యలు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తూ ప్రమాదాలు తగ్గడానికి కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని రవాణాశాఖ అధికారులు తయారు చేసిన డాటాలో పొందుపరిచారు. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగర భౌగోళిక పరిస్థితులు, కనెక్టివిటీ, వాహన సాంద్రతతో పోలిస్తే విభిన్నంగా ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తర, దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉండడంతో అన్ని రాష్ర్టాల వాహనాల రాకపోకలు మన రాష్ట్రం గుండా సాగిస్తుంటాయి. ముఖ్యంగా గ్రేటర్‌ను తాకుతూ వెలుతుంటాయి. వాహన సాంధ్రత హైదరాబాద్‌లో ఎక్కువైనప్పటికీ తగ్గుముఖం పడుతుండడం సంతోషపడే విషయం. మొత్తం ప్రమాదాల విషయానికి వస్తే మేడ్చల్ పరిధిలో ప్రమాదాల సంఖ్య 2016లో 2746 నమోదు కాగా, ప్రమాదాల్లో 873 మంది మృత్యువాత పడ్డారు. 2017 విషయానికి వస్తే 3704 ప్రమాదాలు జరుగగా, 777 మంది మృత్యువాత పడ్డారు. ఇక 2018లో 3469 ప్రమాదాలు జరుగగా, 644 మంది మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 2017లో 783 మంది మృత్యువాత పడగా, 2018లో 699 మంది మృత్యువాత పడ్డారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 2016లో 371, 2017లో 311 మంది, 2018లో 303 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌లో 4శాతం ప్రమాదాలు తగ్గడంతో పాటు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన పెరుగడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...