పాలీసెట్‌కు 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు


Fri,March 22, 2019 04:14 AM

అహ్మద్‌నగర్ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్ పరీక్షలకు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గానూ ఏప్రిల్ 16న పరీక్షలు నిర్వహించి 24వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు పదో తరగతి పాసైన విద్యార్థులతోపాటు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండడంతో విద్యార్థులకు సువర్ణావకాశంగా మారనున్నది. రాష్ట్రంలో 55 ప్రభుత్వ, 140ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, ప్రభుత్వ కళాశాలల్లో 11,740 సీట్లతో మొత్తం 61,260 సీట్లున్నాయి. కాగా, ఈ కళాశాలల్లో ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో సాధారణ దరఖాస్తు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250లతో పాలీసెట్ పరీక్షలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తును https://tspoly cet.nic.in లో చేయడంతోపాటు మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆధార్ కార్డు , ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్, పాస్‌పోర్ట్ ఫొటో, కుల ధ్రువీకరణ పత్రంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలు పొందే నాటికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ కేంద్రాల్లో దరఖాస్తు చేసిన వెంటనే పాలీసెట్ హాల్ టికెట్ పొందవచ్చు. కాగా, పాలీసెట్ పరీక్షలకు హెల్ప్‌లైన్ సెంటర్‌గా మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల వ్యవహరించనున్నది.

ఏప్రిల్ 16న నిర్వహించనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి విద్యార్థులతోపాటు 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ-సేవా కేంద్రాల్లోనేగాక ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా సాంకేతిక విద్యలో ఆధునికత చోటుచేసుకుంటున్న తరుణంలో పదో తరగతి విద్యార్థులతో పాటు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...