బీసీలకు ఉచిత నైపుణ్య శిక్షణ


Fri,March 22, 2019 04:14 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వెనుకబడిన తరగతులు, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులకు పలు కోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి విమలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు చదివిన వారు మాత్రమే అర్హులని, అర్హతలు, ఆసక్తి గల వారు తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో గోల్నాకలోని బీసీ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో సంప్రదించి ఏప్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 20 కిలో మీటర్లలోపు ఉన్న వారికి ఉచిత బస్‌పాస్ సౌకర్యం, 20 కిలోమీటర్లు దాటిన వారికి హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సామ్‌సంగ్ ఇండియా వారి నియమావళి ప్రకారం, స్కాలర్‌షిప్స్, 100 శాతం ప్లేస్‌మెంట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
- టాబ్స్, ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, హ్యాండ్‌హెల్డ్‌ఫోన్ల రిపేరింగ్‌లో 3 మాసాలు శిక్షణ ఉంటుంది.
- ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ ప్లాస్మా టీడీ, హోం థియేటర్, డీవీడీ బ్లూరే ప్లేయర్స్) ఆడియో, వీడియో ఏవీలో శిక్షణ. మొత్తంగా 3 మాసాలు ట్రైనింగ్‌నిస్తారు.
- రిఫ్రిజిరేటర్స్, రూమ్ ఏయిర్ కండీషనర్స్, వాషింగ్ మిషన్లు, అండ్ మైక్రోవేవ్ ఓవెన్స్ రిపేరింగ్ శిక్షణ. మొత్తంగా 4 మాసాల పాటు శిక్షణనిస్తారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...