బాలికను తీసుకెళ్లిన యువకుడి రిమాండ్


Fri,March 22, 2019 04:14 AM

కీసర : పెండ్లి చేసుకుంటానని బాలికను తీసుకెళ్లిన యువకుడిని కీసర పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం .... కీసర మండలం అహ్మద్‌గూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసం ఉండే కీర్తి రమేశ్ కూతురు 9వ తరగతి చదువుతుంది. చీర్యాల్‌లోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్... ఈ బాలికను ప్రేమ పేరుతో పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 18న స్కూల్‌కు వెళ్లిన బాలికను తీ సుకెళ్లాడు. అయితే స్కూల్‌నుంచి కూతురు రాకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తండ్రి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. వెంకటేశ్ బాలికను పెండ్లి చేసుకోవడానికి ఈ 19న కరీంనగర్, హుజారాబాద్‌లో ఉండే అక్క వద్దకు తీసుకెళ్లాడు. ఆమె అభ్యంతరం తెలుపడంతో మహారాష్ట్రలో ఉండే రెండో అక్క వద్దకు కెళ్లాడు. ఆమె కూడా తిరస్కరించడంతో బాలికను తీసుకొని నేరుగా కీసర పోలీసుస్టేషన్‌కు వచ్చారు. వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...