రేవంత్‌రెడ్డికి ఆదిలోనే చుక్కెదురు


Fri,March 22, 2019 04:14 AM

కూకట్‌పల్లి, నమస్తే తెలంగాణ : కూకట్‌పల్లి హస్తం నేతల మధ్య వర్గపోరు మళ్లీ బయట పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూకట్‌పల్లిలోని తూము పద్మారావు గార్డెన్స్‌లో బుధవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి హాజరైన కార్యకర్తల సమావేశానికి ఓ వర్గం నాయకులు దూరంగా ఉన్నారు. కార్యకర్తలు వందల సంఖ్యలో హాజరవుతారని ఏర్పాటు చేసిన కుర్చీలు సైతం నిండని పరిస్థితి ఏర్పడింది. వంద మంది కూడ కార్యకర్తలు సమావేశానికి రాకపోవడంతో రేవంత్‌రెడ్డి సైతం నిరాశకు గురైనట్లు సమాచారం. కొన్నేండ్లుగా కూకట్‌పల్లి హస్తం నాయకుల మధ్య ఉన్న విభేదాలు మళ్లీ సమావేశంలో బయటపడ్డాయి. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురేయాలన్న ఆశతో పార్టీ అధిష్ఠానం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి బరిలో దింపింది. పార్లమెంట్ నియోజకవర్గంలో అంతంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి నాయకులున్న కూకట్‌పల్లిలో ఆరంభ సమావేశమే రేవంత్‌రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినైట్లెంది. సమావేశానికి కూకట్‌పల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి దూరం కావడం నాయకుల్లో చర్చకు దారితీసింది. కారు స్పీడుకు అసలే ఒక సారి చతికిల పడిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కలిసి రాని కాంగ్రెస్ నాయకులను నమ్ముకుని ఈ సారైన గెట్టిక్కుతాడా? అన్న చర్చ జరుగుతుంది. అంతే కాకుండా సమావేశంలో వేదికపై ఉన్న చాలా వరకు నాయకులు పక్క నియోజకవర్గాలకు చెందిన వారై ఉండటం, సమావేశానికి కార్యకర్తలు పెద్దగా రాకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందనే చెప్పవచ్చు. ఇప్పటికే కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి నాయకులు టీఆర్‌ఎస్ గూటికి చేరారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...