పెండ్లి అయిన 12 ఏండ్లకు వరకట్న వేధింపులు...


Fri,March 22, 2019 04:13 AM

పేట్‌బషీరాబాద్ : పెండ్లి అయిన 12 ఏండ్ల తర్వాత వరకట్న వేధింపులు ఎక్కువకావడంతో, భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై పరశురాం కథనం ప్రకారం... రాజస్థాన్ రాష్ట్రం మహ్‌వా తహసీల్, హుర్లా గ్రామానికి చెందిన సురేశ్‌చంద్ జంగిడ్ కూతురు నిర్మలాకుమారి అలియాస్ మంజు(29)కు అదే ప్రాంతానికి చెందిన సంతోశ్‌కుమార్‌తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కుత్బుల్లాపూర్, శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. అయితే ఆరు సంవత్సరాల తర్వాత వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. వివాహం సమయంలో ఇచ్చిన కట్నం కా కుండా మరో రూ.5 లక్షలు తేవాలంటూ అత్త, మామ, భర్తతో పాటు మరుదులు, ఆడబిడ్డలు వేధిస్తున్నారు. వేధింపులు తాళలేక మంజు ఈనెల 16న జైపూర్ వెళ్తున్నానని సోదరి మల్కకు ఫోన్ చేసి విమాన టికెట్ బుక్ చేసుకుంది. అదే రోజు విషం తీసుకుని ఆతహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త సంతోశ్‌కుమార్ స్థానికంగా ఓ వైద్యశాలకు తరలించగా పట్టించుకోకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 19న సాయంత్రం మృతి చెం దింది. విషయం తెలుసుకు న్న తల్లిదండ్రులు వచ్చి అదనపు కట్నం వేధింపులు తాళలేకనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతు రాలి భర్త, మామ జగదీశ్, అత్త కిరణ్,మరుదులు కిరణ్, రామావతార్, ఆడబిడ్డలు రేఖ, దేవిలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...