తల్లి మరణంతో మనస్తాపం ఉరి వేసుకొని కుమారుడు ఆత్మహత్య


Fri,March 22, 2019 04:13 AM

ఖైరతాబాద్ : తల్లి మరణాన్ని కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. రెండు నెలలుగా తీవ్ర మనస్తాపానికి గురై చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైఫాబాద్ ఎస్సై సైదిరెడ్డి కథనం ప్రకారం.... ఓల్డ్ సీఐబీకి చెందిన ముత్యాల నరసింహరాజు ఖైరతాబాద్ పోస్టాఫీస్ సమీపంలో రబ్బర్ స్టాంప్స్ తయారు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన రెండో కుమారుడు ముత్యాల చంద్రజిత్ (24) బీటెక్ పూర్తి చేసి తండ్రి పనిలో పాలుపంచుకున్నాడు. అయి తే రెండు సంవత్సరాలుగా తల్లి అనూరాధ అనారోగ్యంతో ఉండటం చంద్రజిత్‌ను కుంగదీసింది. ఈ ఏడాది జనవరిలో ఆమె మరణించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం తల్లి నెల మాసికం నిర్వహించిన అనంతరం రాత్రి వరకు కుటుంబ సభ్యులతో ఉన్న చంద్రజిత్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉదయం ఎంతకు తలుపు తీయకపోవడంతో అనుమా నం వచ్చి తలుపులు పగులగట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తల్లి మరణం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...