పక్కాగా లెక్కించాలి..


Thu,March 21, 2019 02:02 AM

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును పక్కాగా లెక్కించాలని, రాత్రి వేళల్లో చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఉంచాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు వర్తకర్ ప్రసాద్ హన్మంత్‌రావు అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వ్యయ పరిశీలన చేయనున్నట్లు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : బుధవారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల వ్యయం, అభ్యర్థుల ఖర్చుల వివరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు ప్రసాద్ హన్మంతారవు మాట్లాడుతూ.. డబ్బు, మద్యం పంపిణీ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులు నామినేషన్ వేసే రోజు నుంచి ఖర్చుల వివరాలు పరిగణనలోకి వస్తాయన్నారు. ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి ఖర్చుల పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, పోటీ చేసే అభ్యర్థుల ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో వాహనాలు, సభలు, ర్యాలీలకు, ప్రకటనలు, పెయిడ్ న్యూస్‌కు సంబంధించి ప్రతిరోజు సంబంధిత ఖర్చుల వివరాలను నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రొపార్మాలో అందజేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వారి వివరాలను రికార్డు చేసి సీ-విజిల్ యాప్‌లో ఫి ర్యాదు చేస్తే, 24 గంటల్లో అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగికి సంబంధించి ఫిర్యాదులను gp.observerchevella @gmail.com, లేదా 63090 09216 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలన్నారు. అదేవిధంగా రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాలలో ఎలాంటి అక్రమాలు జరిగిన exp.observer505152@gmail.com, 63090092 15 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలన్నారు. అనంతరం జిల్లా మీడియా కేంద్రాన్ని సందర్శించి, ఎన్నికల ప్రక్రియల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఉషారాణి, డీసీవో అనిత, సమాచార పౌరసంబంధాల శాఖ ఉపసంచాకులు ఎన్.వెంకటేశ్వరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజీనీర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...