ఇఫ్లూలో యూఎస్ ప్రతినిధుల బృందం


Wed,March 20, 2019 12:22 AM

-ఉన్నత విద్యావిధానంలో ఇఫ్లూ పాత్రపై ఆరా
సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ : ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో యునైటెడ్ స్టేట్స్(యూఎస్)లోని పలు యూనివర్సిటీలకు చెందిన 14 మంది ప్రతినిధులు పర్యటించారు. భారతదేశంలో ఉన్నత విద్యా విధానంలో ఇఫ్లూ పాత్రను తెలుసుకునేందుకు మంగళవారం ఇఫ్లూను సందర్శించారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్, అకాడమిక్ డీన్స్, వివిధ శాఖలు, అంతర్జాతీయ సంబంధాల అధికారులు యూఎస్ బృందానికి ఇఫ్లూ పాత్రను వివరించారు. వర్సిటీ నిర్వహిస్తున్న పలు భాషల ప్రొగ్రామ్‌ల గురించి వివరించడంతోపాటు ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ పాత్ర గురించి చెప్పారు. ఇఫ్లూ ఉన్నత విద్యావిధానాల్లో పరస్పర అవగాహన కోసం, ఫ్యాకల్టీ ఎక్చేంజ్ కార్యక్రమం, కరిక్యులం తయారీ, విద్యార్థుల ఎక్చేంజ్ వంటి ప్రొగ్రామ్ వంటి విషయాలను వర్సిటీ అధికారులతో యూఎస్ బృందం చర్చించింది. ఫుల్ బ్రైట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రొగ్రాం ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ రెండు వారాలపాటు ఈ బృందాన్ని కోఆర్డినేట్ చేస్తోంది. ఇఫ్లూలో నిర్వహిస్తున్న పలు కోర్సులు, ప్రొగ్రామ్‌లు, నిర్వహిస్తున్న విధుల పట్ల బృందం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇఫ్లూతో కలిసి పనిచేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు తెలిపారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...