నగరంలో అక్రమ వడ్డీ వ్యాపారం


Wed,March 20, 2019 12:15 AM

-తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ దందా
-8 నుంచి 10 శాతం వడ్డీ వసూలు
-ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా వ్యాపారం
-రంగంలోకి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
-నలుగురు ఏజెంట్లు అరెస్ట్
-పరారీలో ప్రధాన నిందితుడు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చిరు వ్యాపారుల ఆర్థికపరమైన అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలకు రుణాలిస్తూ.. వాటిని బలవంతంగా వసూలు చేస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారుల ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన నిర్వాహకుడు నగరానికి వచ్చి ఏజెంట్లతో ఇక్కడ యథేచ్చగా అధిక వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన పి. ఇలాంగో నగరానికి జీవనోసాధి కోసం వచ్చాడు. సికింద్రాబాద్‌లోని మధురానగర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్, సాయి కృష్ణ ఫైనాన్స్, ఓమ్ గణేశ్ ఫైనాన్స్, సాయి అఖిల్ ఫైనాన్స్ పేర్లతో వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఈ వ్యాపారానికి ఎలాంటి అధికారిక అనుమతులు లేవు. ఈ నాలుగు సంస్థల పేరుతో అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. తన వ్యాపారాన్ని నిర్వహించేందుకు తమిళనాడుకు చెందిన జయకుమార్, అయ్యావండర్ పేరియ స్వామి, కారుపయ్య రాజ్‌కుమార్, ధర్మరాజ్ శివబాలన్‌లను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. డబ్బు అవసరమున్న కిరాణ దుకాణాలు, పాన్‌షాప్‌లు, ఆటో డ్రైవర్లు, టీ స్టాల్స్, రోజూ కూలీలు తదితరులను ఎంచుకుంటారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకొని 8 నుంచి 10 శాతం వడ్డీతో అప్పులు ఇస్తుంటారు. డబ్బు ఇచ్చే సమయంలోనే ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుంటారు. ఈ అప్పు తీసుకున్న వారు ప్రతి రోజు వాయిదా చెల్లించాలి.

ఇచ్చిన అప్పును 100 నుంచి 120 రోజుల్లో తిరిగి వడ్డీ, అసలుతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బును ప్రతి రోజు వసూలు చేసేందుకు 24 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఎవరికైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ఆ సమయంలో వడ్డీ రేట్లు మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం సరిగ్గా లేదు, ఈ రోజు వాయిదా రేపు చెల్లిస్తానంటూ వేడుకున్నా వారి వద్ద నుంచి ముక్కుపిండి వడ్డీలు ఈ ముఠా వసూ లు చేస్తుంది. ఈ ముఠా ఆరాచకాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం నిఘా పెట్టి వడ్డీ లు వసూలు చేసే సమయంలో నలుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా వడ్డీ వ్యా పారానికి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో వీరి వద్ద నుంచి రూ. 6,83,510 నగదు, 15 ఫైనాన్స్ రిజిస్ట్రార్ బుక్స్, వినియోగదారులకు సంబంధించిన డబ్బు వసూలుకు చెందిన 110 పాకెట్ పుస్తకాలు, కొత్త గా ఉన్న పాకెట్ పుస్తకాలు. వినియోగదారులు సంతకా లు చేసిన ఐదు చెక్కులు తదితర వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. ఇదిలాఉండగా... ప్రధాన నిర్వాహకుడిపై 2017లో తెలంగాణ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదయ్యింది, అయినా కూడా తన తీరు మార్చుకోకుండా తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నాడు. ఈ కేసు లో ప్రధాన సూత్రధారి ఇలంగో పరారీలో ఉండగా మిగ తా నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణకు చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...