షీ సేఫ్ రన్


Mon,March 18, 2019 12:33 AM

-షీటీమ్స్ రన్‌కు పదివేల మంది..
-ఉత్సాహంగా పాల్గొన్న యువత
ఖైరతాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు, షీ టీమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి రన్‌కు వేదికైన నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా ఆదివారం స్త్రీ జనసంద్రంగా మారింది. 2కే, 5కే, 10కే విభాగాల్లో నిర్వహించిన ఈ రన్‌ను గవర్నర్ నరసింహన్, చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, అడిషనల్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) షిఖాగోయెల్‌తో కలిసి ప్రారంభించారు. సుమారు పది వేల మంది విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ రన్‌లో పాల్గొని స్ఫూర్తి నింపారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, సినీనటులు పూజా హెగ్డె, అరుణా రెడ్డి, నిహారిక, రాహుల్ విజయ్ ఈ రన్‌లో పాల్గొని జోష్ నింపారు. 10కే రన్‌లో పాల్గొన్న వారికి పరుగు సమయాన్ని అంచనా వేసేందుకు అత్యాధునిక టైమ ర్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. వారికి మంచినీరు, ఎనర్జీ డ్రింక్స్, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బ్లూ డ్రెస్ కోడ్‌తో రన్ నిర్వహించగా నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతం నీలి వర్ణంగా మారింది.

-మహిళా భద్రతకు మారుపేరు షీటీమ్స్, రాష్ట్రంలోని మహిళలందరూ సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉన్నారు.
-మహేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ
-హైదరాబాద్ నగరం మహిళలకు సురక్షితమైన ప్రాంతమని ప్రపంచానికి చాటు దాం.. ఇటీవల న్యూయార్క్ చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా 240 నగరాల్లో అన్ని వర్గాల వారు శాంతియుతంగా నివసించే యోగ్యమైన అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను ఎంపిక చేయడం మన అదృష్టం.
-అంజనీకుమార్, నగర పోలీసు కమిషనర్
-మహిళ భద్రతకు భరోసా కల్పించేందుకు 24/7 షీటీమ్స్, నగర పోలీసుశాఖ అం దుబాటులో ఉంటుంది
- షికా గొయోల్, అడిషనల్ కమిషనర్

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...