వైశ్యులకు ప్రభుత్వం చేయూత


Mon,March 18, 2019 12:27 AM

ఖైరతాబాద్,మార్చి 17 : ఆర్య వైశ్యులు ప్రజాసేవలో ఎల్లప్పుడు ముందుంటారని మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్ వ్యవస్థాపకులు దివంగత రామ్‌దాస్ అగర్వాల్ జయంతి సందర్భంగా ఐవీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో వైశ్ ఎక్తా దివస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోశయ్య హాజరై మాట్లాడారు. దేశంలోని ఆర్యవైశ్యులందరూ సంఘటితంగా ఉండి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసిం గ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కొల్లెటి దామోదర్‌గుప్త మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా వైశ్యుల గురించి ఆలోచించలేదని, కానీ సీఎం కేసీఆర్ ఉప్పల్‌లో ఐదెకరాల భూమిని ఉచితంగా అందించారని తెలిపారు.

అలాగే పేద ఆర్య వైశ్యుల ఉన్నత చదువులకు విదేశీ విద్య, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్‌లను అందిస్తామని కూడా హామీనిచ్చారన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయ కమిటీకి ఆరుగురు డైరెక్టర్లు, కాళేశ్వరం దేవాలయం చైర్మన్, మూడు మార్కెట్ కమిటీ చైర్మన్లు, 78 కార్పొరేషన్ డైరెక్టర్ పదువులను కేటాయించి ఆర్య వైశ్యులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యనిచ్చిందన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 19 మంది సివిల్స్ పాసైన వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహకారం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...