నిరుపేదల సేవలో తేరా తేరా


Mon,March 18, 2019 12:27 AM

అమీర్‌పేట్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగరంలో పేదలకు దుస్తులు, పాదరక్షలు, దుప్పట్లు మరియు ఇతర గృహోపకరణాలను విరాళంగా అందించేందుకు తేరా తేరా పేరుతో చేపట్టిన దాతృత్వ కార్యక్రమం అక్కడి పేదలకు ఎంతో ఉపయోగపడింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నగరానికి చెందిన కవల్‌జిల్ కౌర్, రమణ్‌దీప్‌సింగ్ గాంధీ, రణ్‌వీర్‌సింగ్ గాంధీ తమ వంతు సామాజిక బాధ్యతగా తేరా తేరాను ప్రారంభించారు. ఈ దుకాణంలో కేవలం రూ. 13లకే ఏ వస్తువులైనా కొనుగోలు చేయవచ్చు. అయితే సామాజిక బాధ్యతల మేరకు కనీస స్థాయిలో కూడా వస్తువులు సమకూర్చుకోలేని నిరుపేదలకు ఈ దుకాణం స్వాగతం పలుకుతున్నది. ఈ దుకాణంలో చిన్న పిల్లల నుంచి మొదలు పెద్దల వరకు అన్ని రకాల దుస్తులు, దుప్పట్లు, గృహాలంకరణ వస్తువులు, ఆట వస్తువులు మొదలు ఏ వస్తువైనా రూ. 13లకే అమ్మకాలు జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ కమిషన్ సభ్యులు సర్దార్ సురేందర్‌సింగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జితేందర్ అగర్వాల్, ఎన్.రవీందర్‌సింగ్ కోహ్లీ, ఎస్.సుందర్‌పాల్‌సింగ్ సలూజ, ఎస్. హజూర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...