కొత్త లేఅవుట్లకు నయా రూల్స్


Mon,March 18, 2019 12:26 AM

-లే అవుట్‌లో తాగు, మురుగునీటి వ్యవస్థల బలోపేతం
-మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
-ఎల్‌ఈడీలు వెలుగులు, పచ్చదనం తప్పనిసరి
-నిబంధనల ప్రకారమే అనుమతులు..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో నూతనంగా లేఅవుట్ చేసే నిర్మాణ రంగ సంస్థలకు ఇక నుంచి కొత్త నిబంధనలు ఆమల్లోకి వచ్చాయి. జీవో 168 ప్రకారం అమలవుతున్న నిబంధనలకు అదనంగా 14 అంశాలను చేర్చుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ రియల్ రంగం పరుగులు పెడుతున్నది. హెచ్‌ఎండీఏ సంస్థ చరిత్రలోనే లేని విధంగా నెలలో రికార్డు స్థాయిలో అనుమతులు మంజూరవుతున్నాయి. కేవలం అనుమతుల ద్వారానే కేవలం నెలకు రూ. 60 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఈ సమయంలోనే శరవేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో లేఅవుట్‌లో కొనుగోలు చేసిన వారి శ్రేయస్సు దృష్ట్యా పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించి కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చారు. గత పాలకుల ముందస్తు ప్రణాళికలు లేమితో హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారి పచ్చదనం, వినోదం, ఆహ్లాదం దూరం కావడంతో పాటు డ్రైనేజీ, పారిశుధ్య సమస్యతో నేటికీ ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇక నుంచి కొత్తగా లేఅవుట్ నిర్మాణం చేసే సంస్థలు మరిన్ని మౌలిక వసతులు సమకూర్చాల్సి ఉంటుంది. సంబంధిత లే అవుట్‌లో తాగు, మురుగునీటి వ్యవస్థ బలోపేతం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, సైక్లింగ్ ట్రాక్, ఎల్‌ఈడీ వెలుగులు, పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డ్రాఫ్ట్ లేఅవుట్ అనుమతి తీసుకుని ఫైనల్ లేఅవుట్ అనుమతి కోసం వచ్చే ముందు జీవో 168 నిబంధనలతో పాటు ఈ నూతన నిబంధనలు పక్కాగా పాటిస్తేనే ఆయా లేఅవుట్‌కు అనుమతి లభించేలా విధంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ నూతన నిబంధనల అమల్లో భాగంగానే గడిచిన నెల రోజులుగా సంస్థ పరిధిలో లే అవుట్లకు అనుమతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక నుంచి తాజా నిబంధనల ప్రకారమేఅనుమతులు మంజూరు చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...