డెకరేషన్ గోదాములో అగ్ని ప్రమాదం


Mon,March 18, 2019 12:23 AM

వనస్థలిపురం : డెకరేషన్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించి సుమారు రూ.40లక్షల వరకు ఆస్తినష్టం జరిగిన సంఘటన శనివారం రాత్రి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన దనావత్ రాము శ్రీవెంకటేశ్వర టెంట్ హౌజ్‌ను నిర్వహిస్తున్నాడు. దానికి సంబంధించిన టెంట్లు, డెకరేషన్ సామన్లు ఉంచేందుకు సాగర్ కాంప్లెక్స్ సమీపంలో మురళీధర్‌కు చెందిన గోదామును అద్దెకు తీసుకున్నాడు. కాగా, శనివారం అర్థరాత్రి తర్వాత అందులో నుంచి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రాము తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...