దవాఖానకు వెళ్లి.. తల్లీపిల్లలు అదృశ్యం


Mon,March 18, 2019 12:23 AM

జవహర్‌నగర్ : దవాఖానకు వెళ్లిన తల్లీ ముగ్గురు పిల్లలు అదృశ్యమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీసీఐ కాలనీలో చోటుచేసుకుంది. ఏఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అయేషా బేగం(25), ఎండీ అశ్రఫ్‌లకు గత ఏడేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు అయాన్(7), అర్ఫాబేగం(5), షిఫా బేగం(3) ఉన్నారు. ఎండీ అశ్రఫ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న అయిశ బేగం ముగ్గురు పిల్లలను తీసుకుని దవాఖానకు వెళుతున్నానని ఇంటి పక్కన వారికి చెప్పి వెళ్లింది. రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త ఎండీ అశ్రఫ్ బంధువులు, తెలిసిన వారి ఇండ్లల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...