తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సింహాద్రి


Sat,February 23, 2019 12:07 AM

చందానగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు కెప్టెన్‌గా పీజేఆర్ స్టేడియం క్రీడాకారుడు సింహాద్రి ప్రాతినిధ్యం వహించనున్నాడు. స్కూ ల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో పాట్నాలో ఫిబ్రవరి 22 నుంచి 3 రోజుల పాటు జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరుగనున్నాయి. కాగా ఇటీవల మంచిర్యాలలో జరిగిన రాష్ర్టస్థాయి పోటీల్లో సింహాద్రి ప్రతిభ కనబరచగా, ఎస్‌జీఎఫ్ అతడిని జాతీయ స్థాయి పోటీలకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కాగా శుక్రవారం సింహాద్రి పాట్నాకు బయలుదేరి వెళ్లాడు. ఈ సందర్భంగా వెస్ట్‌జోన్ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్, పీజేఆర్ స్టేడియం ఇన్‌చార్జి వీరన్న సింహాద్రిని, కబడ్డీ కోచ్ రమేష్ గౌడ్‌ను అభనందించారు. పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలని సూచించారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...