హెల్త్‌కార్డులు ఇప్పించండి..


Sat,February 23, 2019 12:07 AM

ఖైరతాబాద్, ఫిబ్రవరి 22 : 1962 యుద్ధ్ద యోధులకు ఆరోగ్య కార్డులు ఇప్పించాలంటూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ మేరకు వాయిస్ ఆఫ్ వెటరన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కెప్టెన్ పాండురంగా రెడ్డి మాట్లాడుతూ 1962 సమయంలో చైనా దురాక్రమణ చేసిందని, ఆ సమయంలో నాటి భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ కమిషన్ వేసి అత్యవసరంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ చేపట్టిందని, దీంతో దేశం కోసం తమ వంతు సేవలందించాలని వేలాది మంది యువకులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరారన్నారు. ఇండో చైనా, ఇండో పాక్ వార్లలో పాలుపంచుకున్న తమకు 1971లో యుద్ధ్దం ముగిసిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. దశాబ్దాల పాటు రక్షణ శాఖకు వివిధ రూపాల్లో తమ అభ్యర్థలను విన్నవించగా, 2016లో ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ తమకు యుద్ధ యోధులుగా గుర్తింపునిచ్చిందన్నారు. అయితే పెన్షన్, హెల్త్‌కార్డులు మాత్రం ఇవ్వలేదన్నారు. సైనిక సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వాయిస్ ఆఫ్ వార్ వెటరన్స్ ప్రతినిధులు డాక్టర్ కొల్లూరి చిరంజీవి, విజయ్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...